
మండల కేంద్రమైన రెంజల్ ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు, చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్నారనీ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గారి భూమయ్య ఆరోపించారు. పలుమార్లు గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లిన వారు పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. మినీ ట్యాంకుల శుభ్రం చేయడంలో గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోవు పండుగలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ కాలనీలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలని ఆయన కోరారు. దీని విషయంలో ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.