లక్ష కోట్ల వ్యాపారం లక్ష్యం

రామ్‌దేవ్‌ బాబా వెల్లడి
న్యూఢిల్లీ: యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ఆధ్యాత్మికం కంటే వ్యాపారంలో దూసుకుపోవాలని భావిస్తున్నట్లు ఉన్నారు. పతాంజలి గ్రూప్‌ వివిధ ఆఫర్లతో అన్ని వర్గాల వినియోగదారులకు చేరువకావడంతో వచ్చే ఐదేళ్లలో రూ.1లక్ష కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా మని రామ్‌దేవ్‌ బాబా అన్నారు. పతాంజలి ఫుడ్స్‌ (ఇంతక్రితం రుచి సోయా) వ్యాపారాన్ని రూ.45,000- రూ.50,000కు చేర్చడం ద్వారా ఈ మైలురాయిని చేరుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. దేశీయ మార్కెట్‌లోని బహుళజాతి కంపెనీలకు సవాలు విసురుతూ పతంజలి భారతదేశంలో స్వావలంబనపై దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్‌ టర్నోవర్‌ దాదాపు రూ.45,000 కోట్ల స్థాయికి చేరుకుందన్నారు. దేశంలో 70 కోట్ల మంది ప్రజలకు చేరువయ్యామని, 100 కోట్ల మందికి చేరువ కావలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.