భారత్‌, చైనాలకు 80 శాతం రష్యా చమురు

న్యూఢిల్లీ : రష్యా చమురు ఎగుమతుల్లో భారత్‌,చైనా దేశాలు 80 శాతం వాటాను పొందు తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఇది 14 శాతం పెరిగిందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఎనర్జీ (ఐఇఎ) ఓ రిపోర్ట్‌లో వెల్ల డించింది. రష్యా నుంచి చమురు దిగుమతికి ఇరు దేశాలు పోటీపడుతు న్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యా చమురు దిగుమతిపై ఆంక్షలు ప్రారంభించాయి. చౌక ధరలో చమురు విక్రయిస్తుండటంతో భారత్‌, చైనా దేశాలు అవకాశాన్ని అందిపుచ్చుకుంటు న్నాయి. భారత్‌ చమురు అవసరాలు 45 శాతం మేర రష్యా నుంచి తీరు తుండటం విశేషం. రష్యా, ఉక్రెయిన్‌ యుద్దానికి ముందు యూరోపియన్‌ దేశాలకే ఎక్కువ ఎగుమతులు జరిగేవి. ఆ సమయంలో రష్యా నుంచి ఆసియా దేశాలకు కేవలం 34 శాతం మాత్రమే ఎగుమతి అయ్యేది. తాజాగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు రష్యా చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఆసియా దేశాలకే ఎగుమతి అవుతోంది. గడిచిన నెలలో రష్యా రోజుకు సగటున 3.87 మిలియన్‌ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసింది. ఇందులో దాదాపు 2 మిలియన్‌ బ్యారెళ్లను భారత్‌ దిగుమతి చేసుకుంది. చైనా ఏకంగా 2.2 మిలియన్‌ బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది.

Spread the love