– దిగుమతి ఆంక్షలపై కేంద్రం యూటర్న్
న్యూఢిల్లీ : ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్ తీసుకున్నది. అలాంటిదేమీ ఉండబోదని అధికారికంగా ప్రకటించింది. అలాగే, నూతన ‘దిగుమతి నిర్వహణ వ్యవస్థ’ను తీసుకొస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటనను చేసింది. కొత్త నిబంధనలన ప్రకారం.. ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలు వాటి దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి బహిర్గతం చేయాలి. కాగా, గతంలో కేంద్రం జారీ చేసిన లైసెన్సింగ్ నోటిఫికేషన్‌తో ఈ రంగం ఆందోళన చెందింది. కాగా, భారత్ ప్రణాళికలపై ఇటీవల జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో అమెరికా, చైనా, దక్షిణ కోరియా, తైవాన్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవటం గమనార్హం.