నేడు లాసెట్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌ రాతపరీక్షల ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేస్తారని లాసెట్‌ కన్వీనర్‌ బి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ డి రవీందర్‌, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు హాజరవుతారని పేర్కొన్నారు.
లాసెట్‌కు 43,692 మంది దరఖాస్తు చేస్తే 36,218 (83 శాతం) మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.