నవ తెలంగాణ-చౌటుప్పల్ రూరల్: దండుమల్కాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డిల నేతృత్వంలో భారతదేశపు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి మంగళవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి ఇందిరాగాంధీ ఎన్నో సేవలు చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దండు మల్కాపురం గ్రామ మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్, వార్డు సభ్యుల విజయ్ కుమార్ యాదవ్, దేప శ్యాంసుందర్ ముదిరాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.