
ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను సీఎం కేసీఆర్ ప్రకటించటం పట్ల మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో సురేందర్ ను ఎంపిటిసి ప్రవీణ్ గౌడ్, మండల కో ఆప్షన్ నెంబర్ గౌస్, నాయకులు తుపాకుల రాజేందర్ గౌడ్, శ్యామ్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.