వంశీచంద్ రెడ్డికి శుభాకాంక్షలు తెల్పిన నేతలు

నవతెలంగాణ-ఆమనగల్ 
  సీడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కల్వకుర్తి సమీపంలోని గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డిని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకేలు అందజేసి శాలువాలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు భగవాన్ రెడ్డి, కడ్తాల్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎక్బాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.