నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామానికి చెందిన ఆకులపల్లి సుదర్శన్ రాజ్ రిటైర్డ్ ఎస్సై గారిని అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని ఆయన కోరారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించినట్లయితే ప్రజలకు సేవ చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల బకాయిలను ఇప్పించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచులకు పెళ్లిళ్లకు పసుపు కుంకుమతో పాటు పూస్తే మట్టలను ఇప్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. బోధన్ నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నిరుద్యోగులకు 12 వేల రూపాయల వరకు ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. క్రికెట్ బ్యాట్ కు మీ అమూల్యమైన ఓటు వేసి ఈ నిరుపేదను అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని ఆయన కోరారు.