– వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
రానున్న ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి సీపీఐ(ఎం) నకిరేకల్ అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులుని గెలిపించాలని వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ శాసనసభలో కమ్యూనిస్టులు లేనిలోటు శాసనసభ కాలంలో స్పష్టంగా కనిపించిందన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు ధరిని పేరుతో రైతుల కోల్పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి సొంత ఇల్లు లేవు ఇంటి జాగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికైనా సిపి( ఐ) ఎం అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపించగలరని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న మండల కమిటీ సభ్యులు కొప్పు శ్రవణ్ దండు రవి, నన్నే సాహెబ్, నాగరాజు పాల్గొన్నారు.