– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీసభ్యులు ఎంవీ రమణ
జోగులాంబ గద్వాల: మతోన్మాద బీజేపీని ఓడించి.. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను ప్రజలు గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో రేపల్లె దేవదాసు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ ని దాని మిత్ర పక్షాలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి వామపక్ష పార్టీల అభ్యర్థులను ప్రజలు గెలిపి ంచాలని కోరారు. ప్రజల మధ్య కుల, మతాల పేరుతో విధ్వేషాలు సష్టించే బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు రాకుండా ఉండేందుకు కషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం19 స్థానాలలో స్వతం త్రంగా అభ్యర్థులను ప్రకటించిందని, తాము సొంతగానే ప్రజా క్షేత్రం లోకి వెళుతున్నామని పొత్తుల విషయంలో కాం గ్రెస్ అనుస రించిన నిర్లక్ష్య, బాధ్యతారాహిత్య నాన్చుడు ధో రణి విధానాలతో తాము సొంతంగా పోటీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దష్టిలో ఉంచుకుని కార్మికులు, రైతులు వివిధ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే కమ్యూనిస్ట్‌లను గెలిపించి చట్ట సభలకు పంపాలని కోరారు. తాము పోటీ చేయని చోట బీజేపీని ఓడించే వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల గెలుపునకు కషి చేస్తామని అన్నారు. జిల్లా లోని ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసి వ్యక్తిగత విమర్శలతో విలువైన సమయాన్ని వధా చేస్తున్నారు అని దశాబ్దా లుగా ఆర్డీఎస్ గట్టు ఎత్తి పోతలు, సీడ్ పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే నాయకు లకు ప్రజల ప్రగతి సమగ్ర అభివద్ధి లౌకిక విధానాలను కలిగి ఉన్న వారికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి , జిల్లా కమిటీ సభ్యులు జీ.రాజు , పరం జ్యోతి , మద్దిలేటి, నర్మదా, వీవీ నర్సింహాచ, ఈదన్నా , ఉప్పేర్ నర్సింహా పాల్గొన్నారు.