– ఎ.వాణీప్రసాద్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రకృతితో సామరస్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్ ఎ.వాణిప్రసాద్ సూచించారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లో ఈపీటీఆర్‌ఐ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు-సుస్థిర వ్యవసాయ జీవవైవిధ్యం అనే అంశంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాణీప్రసాద్ మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతితో సామరస్య జీవనాన్ని ప్రపంచం అలవర్చుకోవాలని కోరారు. వ్యర్థాలను తగ్గించుకోవాలనీ, పర్యావరణం కోసం సుస్థిర జీవన విధానాన్ని అవలంభించాలని హితవు పలికారు. రూరల్ టెక్నాలజీ పార్క్ రిటైర్డ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వై.గంగిరెడ్డి, వ్యవసాయ జీవ వైవిధ్యంపై ప్రజంటేషన్ ఇచ్చారు.