– మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రావణ్ కుమార్‌రెడ్డి
మదనాపురం: మదనాపురం మండల కేంద్రంలో ఈ నెల 20 వ తేదీన బతుకమ్మ సంబు రాలను ఘనంగా నిర్వహించుకుందామని మార్కె ట్ కమిటీ చైర్మన్ శ్రావణ్ కుమార్‌రెడ్డి అన్నారు. మదనా పురం మండలంలోని దుప్పల్లి గ్రామంలో మంగవారం గ్రామస్తులతో మహిళలతో సమావేశమై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కతిక రీత్యా ప్రతీఏటా ఎంతో అంగరంగ వైభవంగా వేడు కలను జరుపుకుంటామని వెల్లడి ంచారు. ఇప్పడు కూడా అదే మాదిరిలో బతు కమ్మ సంబరాన్ని జరుపుకుందామని అందరూ పాల్గొ ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్ర మంలో మండల కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, సర్పంచ్ శివశంకర్, మదనాపురం బీఆర్‌ఎస్ అధ్యక్షులు ఆవుల బాలకష్ణ, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మనోజ్ కుమార్, నాయకులు మహదేవన్ గౌడ్, శ్రీనివాసులు, ప్రవీణ్ చారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.