ప్రకృతి విపత్తును ధైర్యంగా ఎదుర్కొందాం: ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రకృతి విపత్తు వల్ల జరిగిన వరదలను ధైర్యంగా ఎదుర్కొందామని వరద బాధితులకు అధికారులతో సహా పార్టీ శ్రేణులు సహాయక చర్యలో పాల్గొనాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని దయ్యాలవాగు మరియు గుండ్ల వాగు ప్రవాహ ఉధృతిలో ముంపుకు గరైన ప్రాంతాలను పరిశీలించడంతోపాటు పునరావాస కేంద్రంలో బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అవసరమైతే తప్ప బయటకు రాకుండా వర్షాలు తగ్గేవరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.వర్షాల వలన, వరదల వలన నీట మునిగిన ప్రాంతాలను పర్యటించి వరదల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని, వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలోని దయ్యాల వాగు పసరా గ్రామంలోని గుండ్ల వాగు ఉధృతి వల్ల నీట మునిగిన ఇండ్లకు నష్టపరిహారం కల్పించాలని, అలాగే వరదల వల్ల కొట్టుకుపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని అన్నారు. అలాగే లక్నవరం జలాశయం నిండడం వలన వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలలో మాత్రమే ఉండాలని సూచించారు. అలాగే స్థానిక అధికారులు పునరావాస కేంద్రాల యందు కనీస, మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే వరదల వలన జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించి ప్రజలను ఆదుకోవాలని అన్నారు. భారీ వర్షాలతో జలదిగ్ధందంలో చిక్కుకున్న ప్రజలకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టి, వారందనీ సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ములుగు నియోజకవర్గ ప్రజలకు భారీ వర్షాలతో ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే జిల్లా యంత్రాంగం పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని, రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీస్  విధ్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్  బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమయితేనే తప్పా, ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు సేవలందించేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, గోవిందరావుపేట మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, ఆకుతోట చంద్రమౌళి, బండి శ్రీనివాస్, ఎన్.ఎస్.యూ.ఐ. జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, చింతనిప్పుల బిక్షపతి, నూనేటి శ్యామ్, జంపాల చంద్రశేఖర్, మిల్కురీ ఐలయ్య, పంగ శ్రీను, గుండె శరత్, మద్దినేని వినయ్, పులుసం లక్ష్మి, జక్కు రణదీప్ గౌడ్, పత్తిరి మధు తదితరులు పాల్గొన్నారు.