నూతన జాతీయ విద్యావిధానం రద్దుకు పోరాడుదాం

– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు
– శంషాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆజాదీ ర్యాలీ భారీ ప్రదర్శన
– ఆకట్టుకున్న జాతీయోద్యమ వీరుల వేషదారణలు
నవతెలంగాణ- శంషాబాద్‌
భారత జాతీయ ఉద్యమ స్ఫూర్తితో దేశంలో కేంద్ర సర్కార్‌ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం రద్దు కోసం పోరాటం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్య దర్శి తాళ్ల నాగరాజు అన్నారు. సోమవారం శంషాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యం లో భారత స్వాతం త్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆజాది ర్యాలీ నిర్వహిం చారు. భగత్‌ సింగ్‌ స్వాతంత్ర సమర యోధుల వేశదారుణలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్‌ పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆజాదీ ర్యాలీ స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా నుండి ఆర్‌.బి.నగర్‌ గ్రౌండ్‌ వరకు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కె.వై. ప్రణరు అధ్యక్షతన జరిగిన సభలో నాగరాజు మాట్లాడారు. నేడు దేశంలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా పోయిందని ఎవరైనా బిజెపి ప్రభుత్వాని ప్రశ్నిస్తే దేశ ద్రోహం పేరుతో జైళ్ళకు పంపుతున్నారని అన్నారు. అందరికీ ఉచితంగా అందించాల్సిన విద్యను దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుగుతున్న సందర్భంగా విద్యను ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ చేయడానికి నూతన విద్యావిధానం తీసుకుని వచ్చి విద్యార్ధుల హక్కులు కాల రాస్తున్నారన్నారు. విద్యార్ధుల ఫీజులు పెంచి, యూనివర్శీటీలలో కోర్సులను మూసివేస్తూ నూతన జాతీయ విద్యావిధానం పేరుతో యూనివర్శీ టిల ఆటానమీ దెబ్బతీసి అన్ని పరీక్షలు ఎన్టీఎ క్రిందకు తెచ్చి విద్యాప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎం చదవాలో, ఏ కోర్సులను ఎంచుకోవాలో ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయిచినట్టుగా యూనివర్శీటీల గ్రాంట్స్‌ కమిషన్‌ నిర్వీర్యం చేసి హక్కలను తను లాగేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌ లాంటి రాష్ట్రాలలో ప్రజల హక్కులను హరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నూతన విద్యావిధానం తీసుకుని వచ్చిందని తెలిపారు. విద్యార్థుల ఎంత ఐక్యంగా పోరాడి వెంటనే నూతన విద్యా విధానాన్ని తిప్పుకొట్టడం తప్ప వేరే ప్రత్యామ్మా యం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మస్కు చరణ్‌, శ్రీకాంత్‌, శివ, శ్రీకాంత్‌, జయశ్రీ, విజయలక్ష్మి, వేణు, విప్లవ, తరంగ్‌, కౌశిక్‌, ప్రసాద్‌ చారి, అర్జున్‌, దివ్య, తదితరులు పాల్గొన్నారు.