ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదువనిద్దాం, బ్రతకనిద్దాం అని బేటి బచావో బేటి పడావో” అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అన్నారు. శుక్రవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో జరిగిన కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ పరీక్షలు తప్పనిసరి పరిస్థితులలో గర్భస్థ శిశువు ఆరోగ్యం పరీక్షించడానికి చేయాల్సిన పరీక్షలలో లింగనిర్ధారణ పరీక్షలు కూడా చేస్తూ కొన్ని వైద్య పరీక్ష కేంద్రాలు స్కానింగ్ సెంటర్లు ఆధునిక వైద్య సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్నాయని వాటి పాట్లా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.సమాజములోని ఆడశిశువుల పట్ల ఆదరణ కూడా అవినీతికి చర్యలకు తోడ్పడుతున్నాయని వివరించారు. రోజు రోజుకి తగ్గిపోతున్న స్త్రీ, పురుష నిష్పత్తి పెరిగిపోతున్న స్త్రీ భ్రూణ హత్యలను నివారించాల్సిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించిందని, అదే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నియంత్రణ మరియు దురుపయోగం నివారణ చట్టం-1994(Pre-natal Diagnostic Techniques Regulation of Misuse Act-1994)తరువాత ఈ చట్టాన్ని 2003లో సమగ్ర సవరణలతో” గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ( లింగ ఎంపిక నిషేధ )చట్టం 1994 అనగా (Pre Conception and Pre-natal Diagnostic Techniques Prohibition of Sex Selection )Act-1994 గా రూపొందించారు.
పుట్టబోయేది ఆడబిడ్డా, మగ బిడ్డా అని అడగవద్దని అది చట్టరీత్యా నేరమన్నారు.
చట్టం లోని అంశాలు:
కేంద్ర ప్రభుత్వం ఈ క్రింద వివరించిన సందర్భాలలో మాత్రమే గర్భస్థ పిండ పరీక్షలకు అనుమతించింది. గర్భిణీ స్త్రీ వయసు 35 సంవత్సరాలకు పైబడిన ప్పుడు,
స్త్రీలలో రెండుసార్లు కానీ అంతకు మించి కానీ గర్భస్రావం లేదా నష్టం జరిగినప్పుడు,గర్భిణీ స్త్రీలు హాని కరమైన మందులు, అను ధార్మికశక్తి అంటు వ్యాధులు లేదా రసాయనాల ప్రభావం నికి గురైనపుడు, ఆమె కుటుంబంలో ఎవరైనా మానసిక వికలాంగులు జన్యుసంబంధమైన వ్యాధులు గలవారు ఉన్నప్పుడు,
చట్టం -నియమ నిబంధనలు – శిక్షలు
గర్భస్థ పిండ పరీక్షలు చేసే ప్రభుత్వ ప్రైవేటు వైద్య సంస్థలు, జన్యు సలహా కేంద్రాలు, జన్యు ప్రయోగశాలలు,
జన్యు చికిత్సా కేంద్రాలు చట్టప్రకారం నమోదు చేయబడిన వై ఉండాలి,
ఈ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది పూర్తిస్థాయి ప్రమాణాలు కలిగి ఉండాలని,
ఈ సంస్థలు నమోదు పత్రాలను సందర్శకులకు కనిపించి స్థలములు తప్పనిసరిగా ప్రదర్శించాలని,
గర్భిణీ స్త్రీలకు జరిపే ఈ పరీక్షల వలన కలిగే అనుబంధ ప్రభావాలను అనంతరం ప్రభావాలను ముందుగా ఆమె అర్థం చేసుకునే భాషలో వివరించాలని,
పరీక్షల నిమిత్తం నిర్దేశిత ఆమోద పత్రాన్ని గర్భిణీ స్త్రీ నుండి వ్రాతపూర్వకంగా తీసుకోవాలి,
నమోదు పత్రం నకలు అను గర్భిణీ స్త్రీకి అందజేయాలి.
గర్భస్థ పిండం ఆడో మగో పరీక్ష ద్వారా తెలిపిన ఆ విషయాన్ని ఆమెకు గాని ఆమె కుటుంబ సభ్యులు ఎవరికైనా గాని ఏ విధంగా తెలియజేయవద్దని పేర్కొన్నారు. ఈ చట్టం లో పొందుపరచిన నియమాలను ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదు మొదటిసారి చేసిన తప్పుకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష పది వేల రూపాయల జరిమానా అదే తప్పును మరొకసారి చేస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష 50 వేల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలిపారు.
తల్లిదండ్రులు లేదా భర్త లేదా బంధువులు లేదా ఇతర వ్యక్తులు లేదా వైద్య సంస్థలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బాధ్యులని కనుగొనిన లేదా ఈ పరీక్షను ఉపయోగించినారని తెలిసినప్పుడు మొదట చేసిన తప్పుగానూ మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 50 వేల రూపాయల జరిమానా ఐదు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.