దోచుకుతింటున్న బీఆర్‌ఎస్‌ను తరిమేద్దాం

దోచుకుతింటున్న బీఆర్‌ఎస్‌ను తరిమేద్దాం– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ-షాబాద్‌
తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తరిమికొట్టి, ప్రజా సంక్షేమాన్ని అందించే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నెలకొల్పుదామని టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు పీసరి సురేందర్‌రెడ్డి, రాంరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి పామైన భీంభరత్‌ సతీమణి జ్యోతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని హైతాబాద్‌, హైతాబాద్‌తండా, అంకిగూడ, పెద్దవీడు, పెద్ద వీడుతండా, నాన్‌ ధారాన్‌పేట్‌, దామర్లపల్లి, లింగారెడ్డిగూడా, సాయిరెడ్డిగూడెంలో గ్రామాల్లో పార్టీ మండలాధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో గడపగడపకు తిరిగి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పామైన భీంభరత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటున్న దొరల పాలనకు స్వస్తి పలికి, పేద నిరుపేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నెలకొల్పుదామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ప్రతాప్‌రెడ్డి, అనితాసురేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, పొన్న జయమ్మవెంకట్‌రెడ్డి, అశోక్‌, పార్టీ మహిళా మండలాధ్యక్షురాలు అశ్విని, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.