పాలమూరు ప్రజాభేరి సభను విజయవంతం చేద్దాం : ఎంపీపీ

పెద్దకొత్తపల్లి: ఈనెల 31వ తేదీన కొల్లాపూర్‌ పట్టణంలో జరిగే పాలమూరు ప్రజా బేరి సభను విజయవంతం చేయాలని ఎంపీపీ సూర్య ప్రతాప్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కొల్లాపూర్‌ పట్టణంలోని పెంట్లవెల్లి రోడ్డులో 3 గంటలకు పాలమూరు ప్రజా బేరి సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రజా బేరి సభకు ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా వస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ చేయబోయే సంక్షేమ పథకాలను కూడా వివరిస్తారని ఇట్టి సభను మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.