గొప్ప ఆలోచనలతో ముందుకు సాగాలే

– బీఆర్‌ఎస ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌
నవతెలంగాణ-మహదేవపూర్‌
భవిష్యత్‌ బాగు కోసమే యువత పని చేయాలని, గొప్ప ఆలోచనలతో ముందుకు సాగా లని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని నియో జకవర్గం మహదేవపూర్‌ మండలం సూరారం గ్రా మానికి చెందిన యువకులు బీఆర్‌ఎస్‌లో బుధ వారం చేరారు. వారికి జెడ్పీ చైర్మెన్లు మధుకర్‌, జక్కు శ్రీ హర్షిని రాకేష్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశ భవిష్యత్‌ యువత చేతిలోనే ఉందని అన్నారు. రేపటి తరాలకు మార్గదర్శ కులుగా నిలిచే యువత నేటి సమాజంలోని వాస్తవ విషయాలపై చర్చించి ప్రజలకు అవగా హన కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, బీఆర్‌ఎస్‌ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్య క్షులు, కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్‌ శ్రీపతి బాబు, ఉప సర్పంచ్‌ సల్మాన్‌ఖాన్‌, మండల నాయకులు మనోహర్‌, సూరారం నాయకులు పాల్గొన్నారు.