నవతెలంగాణ-బెజ్జంకి
గత 21 రోజులుగా తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె కొనసాగిసాతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. నేడు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడికి కదందొక్కుతామని గ్రామ పంచాయతీ కార్మికులు అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 21వ రోజు కొనసాగింది. మండలంలోని అయా గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.