
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటూ భావితరాలకు స్పూ ర్తి ఇద్దామని ఎంపీపీ భదవత్ రమేష్ నాయక్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్, ఎంపిడిఓ గోపి బాబు, రాములు నాయక్, ఎంపిటిసి చింతల దాస్, ఉప సర్పంచ్ వెంకనోల్ల రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోటి మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడ్పల్లి, రాంపూర్ డి,ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి,తిర్మన్ పల్లి గ్రామాలతో పాటు ఆయా గ్రామాలలో సర్పంచులు, ఎంపిటిసిలు ప్రజా ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
హరితహారంలో భాగంగా నాడుతున్న ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడే హరిత తెలంగాణ విరాజిల్లుతోందని ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలను నాటే విధంగా చూడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి శ్రీ దర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రజలు ఉపాధి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.