ఛలో కోరుట్ల వేలాదిగా తరులుదాం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఛలో కోరుట్ల కార్యక్రమానికి వేలాది గా తరలి వేళ్దమని, డిచ్ పల్లి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం పోస్టర్లను  నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్గం హన్మాండ్లు, నగర అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నర్సయ్య, రూరల్ కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలువేరి దాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు బింగి  మోహన్, శక్కరికొండ కృష్ణ, విట్టల్  పద్మశాలి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ప్రతి గ్రామం నుంచి సంఘ సభ్యులందరూ  కోరుట్లలో జరిగే  పద్మశాలి రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నల్ల హరికిషన్, విశ్వ ప్రకాష్, సాయినాథ్, సత్యనారాయణ, శ్రీపతి నర్సయ్య, వరకాల శీను, కొండమురళి, ముల్క శ్రీనివాస్, దోర్నాల మురళి, రూబీ గంగాధర్, లక్ష్మణ్, గడ్డం గంగాధర్, నరేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.