సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడిగా, ప్రజా వైద్యుడిగా, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారని, సన్నాయిల రాఘవేంద్రం ఆశయాలను ముందుకు తీసుకుపోవటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన సన్నాయిల రాఘవేంద్రం ఆకస్మికంగా మృతి చెందగా విషయం తెలుసుకున్న తమ్మినేని హస్నాబాద్ వెళ్లి రాఘవేంద్రం భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాఘవేంద్రం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించారన్నారు. డాక్టర్‌గానే కాకుండా స్వాతంత్య్ర పోరాట కాలంలో ఆయన పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఆ తర్వాత కమ్యూనిస్టు రాజకీయాలకు దగ్గర ఒక మంచి కమ్యూనిస్టుగా చివరిదాకా ఉన్నారని, ఆయన లేని లోటు సిపిఎంకి ఉంటుందని, ఆయన ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని ఆయన అన్నారు. సన్నాయిల రాఘవేంద్రం కుమారుడు సన్నాయిల ఇంద్రసేన సిపిఎం తిరుమలాయపాలెం మండల కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. సన్నాయిల రాఘవేంద్ర భౌతిక కాయన్ని సందర్శించిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, బిఆర్‌ఎస్ మండల నాయకులు కొవ్వూరి సత్తిరెడ్డి, సిపిఎం మండల నాయకులు అంగిరేకుల నరసయ్య, తుళ్లూరి నాగేశ్వరరావు, పప్పుల ప్రసాద్, బింగి రమేష్, వష పొంగు వీరన్న, నాగాటి సురేష్, సిపిఎం గ్రామ కార్యదర్శి పల్లి రమేష్, మోటపోతుల శ్రీను, బండారి పాపిరెడ్డి, పల్లిి నాగన్న, సత్తిబాబుతో పాటుగా స్థానిక హుస్నాబాద్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.