నవతెలంగాణ- మునుగోడు
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్లో ఎమ్మెల్యే , మంత్రి, రాజ్యసభ పదవుల్లో పనిచేసి చివరి శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గోవర్ధన్ రెడ్డి కూతురు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 24 వేల ఓట్లు సాధించింది. ఈసారి కూడా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కుతుందని ఆశపడి తమకు టికెట్ దక్క పోవడంతో శనివారం కాంగ్రెస్ ను వీడి కార్ ఎక్కుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో పాల్వాయి కుటుంబంతో కలిసి నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు కుర్తిలో పడ్డ ఎలుకచందంగా కాంగ్రెసులో ఉండాలా కారు ఎక్కాలన అర్థం కాక అయోమయంలో ఉన్నట్లు సమాచారం. స్రవంతికి బీఆర్ఎస్ లో చెరితే తమకు మంచి పదవి ఇస్తానని ఆశ చూపినట్లు గుసగుసలు ఇనిపిస్తున్నాయి.