– పోలీస్ కమీషనర్ వెల్లడి
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఎన్నికల సందర్భంగా లైసెన్స్ ఆయుధాలు ఉన్న వారు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మెశ్వర్ శింగనవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని Arms లైసెన్స్ పొందిన వారు సెక్షన్ 21 ఆఫ్ Arms యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని Arms లైసెన్స్ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్ ఆయుదాలను సంబంధింత పోలీస్ స్టేషన్లలో తేది: 21-10- 2023 లోపు జమ చేయవలసినదిగా నోటిఫికేషన్ ను జారీచేయడం అయినది. ఎవరయిన లైసెన్స్ ఆయుదాలు జమ చేయనట్లయితే వారిపై Arms యాక్టు ప్రకారంగా చట్టరీత్య చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు.ఎవరైతే అట్టి ఉత్తర్వుల నుండి మినహాయింపు పొందగోరుతారో వారు , జిల్లా Arms స్క్రీనింగ్ కమిటి, నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని అదనపు డిప్యూటి పోలీస్ కమీషనర్ ఎస్. జయ్ రామ్ ( 87126-59777) కి వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోగలరు అని తెలిపారు.