మీరు డేంజర్‌లో ఉన్నట్లే..!

మీరు డేంజర్‌లో ఉన్నట్లే..!ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ ఫోన్‌ తప్పనిసరి అయింది. ప్రజలు ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడుపుతున్నారు. అయితే చాలా మంది నిద్ర లేవగానే పక్కనే ఉన్న ఫోన్‌ పట్టుకుంటారు. అలా చేయడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తుంటే, అది మీ మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది. ఫోన్‌ ఎక్కువగా వాడిన తర్వాత డిప్రెషన్‌ వస్తుందని చాలా నివేదికల్లో వెల్లడైంది.
ఉదయం లేవగానే మొబైల్‌ ఫోన్‌లో స్క్రోలింగ్‌ చూస్తుంటే మనశ్శాంతి దెబ్బతింటుంది. దీని వల్ల మెదడు ఒత్తిడికి గురవుతుంది. ఇది రోజువారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఎక్కువగా మొబైల్‌ వాడకం చికాకుకు దారితీస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్లలో గడిపే వారికి ఎక్కువగా కోపం వస్తుంది.
ఉదయం లేవగానే ఫోన్‌ ఉపయోగించడం వల్ల మీ ఏకాగ్రత తగ్గుతుంది. దీనితో పాటు, మీ ఉత్పాదకతా తగ్గుతుంది.
ఉదయం పూట ఫోన్‌ వాడే అలవాటు వల్ల కొందరికి ఎక్కువ ఆకలి వేస్తుంది. ఇది ఆహారానికి సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది.