లైన్స్ క్లబ్ వారది మండల శాఖ అధ్వర్యంలో జుక్కల్ లో ఉచిత వైద్య శిబిరం..

నవతెలంగాణ – జుక్కల్

లైన్స్ క్లబ్ వారది అధ్వర్యంలో జుక్కల్ మండల కేంద్రంలో ఉచిత వైద్యశిభిరం నిర్వహించినట్టు మండల నిర్వహకులు గురువారం నాడు తెలిపారు. ఈ సంధర్భంగా వైద్యశిభిరాన్ని ముఖ్యఅథితిగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320- D గవర్నర్ లక్ష్మీ పాల్గోని వైద్యశిభిరాన్ని ప్రారంబించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతి నిధులతో కలిసి మెుక్కలు నాటి వచ్చిన వృద్దులకు, పేషెంట్ లకు బిస్కట్  లు, అల్పహరం అందించారు. షుగర్, బీపీ, క్యాన్సర్, పరిక్షల ను పరీశీలించారు. గవర్నర్ లక్ష్మీ మాట్లాడుతు మానవసేవయే మాగవ సేవా అని అన్నారు. మారుమూల ప్రాంతాలలో  సేవ చేసేందుకు లైయన్స్ క్లబ్ వారది ఎల్లప్పుడు ముందుంటుందని, ఇక్కడి ప్రాంత ప్రజా ప్రతినిధుల సహకారం బాగుందని, త్వరలో కంటి పరిక్షల శిభిరం నిర్వహిస్తామని పేర్కోన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొంపెలి రాములు , సాయగౌడ్, నీలుపటేల్, రాజుపటేల్, మండల లైయన్స్  క్లబ్ వారది సబ్యులు తదితరులు పాల్గోన్నారు.