నవతెలంగాణ – మిరుదొడ్డి
రుణ మాఫీ చారిత్రాత్మక నిర్ణయమని మిరుదొడ్డి పీఏసీఎస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి అన్నారు. శుక్రవారం డైరీ ఫామ్ రైతులు కుంట అనిల్ రూ.2లక్షల 9వేల 250, నీల నాగయ్యకు 2లక్షల 4 వేల 518 రూపాయల రుణ చెక్కులను చైర్మన్ రాజలింగారెడ్డి అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డైరీ, ఫోల్ట్రీ రైతులకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి రైతులు మేలుకోరే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజా పాలన అంటే ఎట్లనో ప్రజా ప్రభుత్వం అంటే ఎట్లనో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నాడని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ముఖ్యమంత్రి అమలు చేస్తారని చెప్పారు. రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పినట్టే నేడు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి విడతలు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశాడని అన్నారు. రైతుల పక్షం నిలబడిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి ఈ ఓ రాజు, భగవాన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.