నవతెలంగాణ-కాశిబుగ్గ
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తక్కువ వడ్డీతో, నామినల్ ప్రాసెసింగ్ చార్జీలతో తమబ్యాంకు ద్వారా అందిస్తు న్న రుణాలను వ్యాపారులు సద్విని యోగం చేసుకోవాలని ఇండియన్ బ్యాంకు కరీంనగర్ జోనల్ మేనేజర్ శ్రీనివాస రావు కోరారు. శుక్రవారం వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ కార్యాలయంలో అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అధ్యక్షతన వ్యాపారస్తులతో మెగా క్రెడిట్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇండి యన్ బ్యాంక్ కరీంనగర్ జోనల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా 50శాతం సబ్సిడీ యూనిట్ కాస్ట్ రూ.12 లక్షల నుండి రూ.కోటివరకు ఉంటుందని ఈపథకానికి అన్నిసామాజిక వర్గాల వారు అర్హులేన న్నారు. పీఎంఈజీపీ క్రింద రూ.50 లక్షలు ఉత్పత్తి, సేవ రంగానికి రూ.25 లక్షల వరకు గ్రామీణప్రాంత పరిశ్రమలకు, 35 శాతం సబ్సిడీతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు పరిశ్రమల స్థాపించి మరో నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావాల ని పిలుపునిచ్చారు. అనంతరం ఛాంబర్ ఆఫ్‌కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీం దర్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అందేవివిధ రకమైన స్కీములను వ్యాపా రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీస్ స్థాపనకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని కోరారు. అనంతరం బ్యాంకు అధికారులను శాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంఎపిసి కరీం నగర్ చీఫ్ మేనేజర్ రమేష్ చంద్ర, చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు మొగిలి చంద్రమౌళి, సాగర్ల శ్రీనివాస్, అల్లె సంపత్, హరినాథ్, రాజేశ్వర్‌రావు, సంపత్, స త్యనారాయణ, యుగంధర్, వీరారావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.