– ఎంఎస్‌ఎంఇ ఎడిసి చంద్ర శేఖర్ వెల్లడి
హైదరాబాద్ : ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం ద్వారా భారతీయ హస్తకళా సంప్రదాయాలను పునరుద్ధరించనున్నామని కేంద్ర ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వ శాఖ అడిషనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ (ఎడిసి) చంద్ర శేఖర్ అన్నారు. త్వరలో చేతివృత్తుల వారికి కూడా ఎంఎస్‌ఎంఇల కింద రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న వరంగల్‌లో దీన్ని ప్రారంభించనున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రారంభమైన మూడు రోజుల పారిశ్రామిక అండ్ ఇండెక్స్‌పో (ఇండెక్స్‌పో)ను ఆయన ప్రారంభించారు. ఆదివారం వరకు ఎక్స్‌పో జరుగనుంది. హస్తకళాకారులు, చేతివత్తుల వారికి రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్‌లో దీన్ని వివిధ మంత్రులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద చేతి వృత్తిదారులకు ఏడాదికి 5 శాతం వడ్డీ రేటుతో రూ.1 లక్ష వరకు రుణాలను అందించనున్నామన్నారు.