
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
టార్గెట్లు, మహా లాగిన్లు, కొత్త పెన్షన్ విధానాలతో పోస్ట్మన్ పై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని కోరుతూ ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ పోస్టమాన్/ఎంటిఎస్ ఆధ్వర్యంలో అబిడ్స్ లోని డాక్ సదన్ ప్రాంగణంలో లాంగ్ డే ధర్నా ఉద్యోగులు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ లాంగ్ డే ధర్నాలో రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన పోస్టల్ ఉద్యోగులను ఉద్దేశించి ఏఐపిఈయు తెలంగాణ సర్కిల్ సెక్రెటరీ ఎం. మదు సూధన్ రావు మాట్లాడుతూ.. సెంట్రల్ హెడ్ కమిటి పిలుపు మేరకు ఈనెల 20వ తేదీన ఢిల్లీలోని ప్రధాన డాక్ సదన్ ముందు పెద్ద ఎత్తున్న ధర్నాను నిర్వహిచనున్నట్లు. వెల్లడించారు. గతం లో పోస్టల్ ఉద్యోగులు 25 డిమాండ్ల పై డిల్లీలోని డాక్ సెక్రెటరి వినీత్ పాండేకు వినతిపత్రం అందించినా సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. పోస్టల్ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఒకే పనిని ముగ్గురుతో చేయిస్తూ పని పని భారంతో ఉద్యోగస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. టార్గెట్లు, మహా లాగిన్ పేరిట ఉద్యోగుల పై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. పోస్టల్ ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. యూనిఫాంకు ఇస్తున్న రూ.5వేల అలవెన్సును రూ.15 వేలకు పెంచాలని కోరారు. ఈ సమస్యల పై కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి 3 సర్కిల్ సెక్రెటరీ శ్రావణ కుమార్, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ టిఎస్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి అజీజ్, మాజీ సర్కిల్ సెక్రెటరి ఓంప్రకాష్, కోఆర్డినేటర్ కమిటి చైర్మన్ జలాలుద్దీన్, జిడిఎస్ సర్కిల్ సెక్రెటరి చారీ, సర్కిల్ అడ్మిన్ సుర్జీత్కుమార్, అకౌంట్స్ సర్కిల్ సెక్రెటరి డిఎన్ మూర్తి, ఇతర ఉద్యోగ నాయకులు పాల్గోన్నారు.