పోగొట్టుకున్న సెల్ ఫోన్ అందజేత

నవతెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన మస్కూరి సాయిలు గత కొన్ని రోజుల కిందట సాటాపూర్ సంతలో సెల్ఫోన్ పోగొట్టుకోగా, ఇట్టి సెల్ ఫోన్ ను(ceir) పోర్టల్ సహాయముతో ట్రేస్ చేసి బాధితుడికి అప్పగించినట్లు రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. పోయింది అనుకున్న సెల్ఫోన్ తిరిగి తన వద్దకు రావడం పోలీసుల సహకారమేనని ఆయన పోలీస్ శాఖను అభినందించారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్లు మిస్ అయినట్లయితే సిఇ ఐ ఆర్ హోటల్ ద్వారా ట్రేస్ చేసి వారికి తిరిగి అప్పగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సి సి టి ఎన్ ఎల్ కానిస్టేబుల్ గణేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.