అనంతగిరి కొండల్లో జోరుగా కార్‌ రేసింగ్‌

– భయాందోళనలో టూరిస్ట్‌లు
– విచ్చలవిడిగా బైక్‌లు, కార్లతో షికారులు
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
అనంతగిరులు పచ్చని ప్రకృతి, ఆధ్యాత్మికతకు నిల యం…అయితే సెలవులు వస్తే చాలు జంట నగరాల నుం చి వచ్చే యువతీయువకుల వికృత చేష్టలతో అనంతగిరికి కుటుంబసభ్యులతో కలిసి పోవాలంటే భయపడే పరిస్థితు లు నెలకొన్నాయి. ఆగస్టు 15, మంగళవారం సెలవు రోజు కావడంతో వేలాది మంది పర్యాటకులు అనంతగిరికి వచ్చా రు. కొంతమంది యువత అనంతగిరి వ్యూ పాయింట్ల వద్ద బైక్‌ రేసులు, కారు రేసులతో అలజడి సృష్టించారు. పెద్దపె ద్ద శబ్దాలతో పాటు రేసింగ్‌లతో వణ్యప్రాణులు అడవిలో నుంచి రోడ్లపైకి వెళ్లే విధమైన పరిస్థితి వచ్చింది. కార్‌ రేసింగ్‌, బైక్‌ స్టంట్స్‌తో రచ్చ చేశారు. ప్రకృతి నడుమ కారు స్టంట్స్‌తో దుమ్ములేపుతూ అలజడి సృష్టించారు. కార్ల సైరన్‌ లు వేసుకుంటూ మోత మోగించారు. బైక్‌, కారు పందాలు (రేసులు) పెట్టుకొని స్థానికులను, పర్యాటకులను భయభ్రాం తులకు గురిచేశారు. ఈ మేరకు కార్ల రేసింగ్‌ వీడియోను స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అధికంగా వారాంతాల్లో కార్ల రేసింగ్‌ జరుగుతోందని తెలిపిన స్థానికు లు.. కార్ల రేసింగ్‌ను అరికట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశా రు. అయితే అడవుల్లోకి అనుమతి లేకున్నా అటవీ శాఖ కిం ది స్థాయి సిబ్బంది డబ్బులు తీసుకుని వారిని లోపలికి పం పించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందని వికారాబాద్‌ పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. అనంతగిరి ఫారెస్టలో అటవీశాఖతో పాటు పోలీసశాఖ సైతం పెట్రోలింగ్‌ నిర్వ హిస్తుందని, అనంతగిరికి స్పెషల్‌గా ఒక ఎస్‌ఐ ఉన్నప్పటికీ ఇలాంటి వికృత చేష్టలు మాత్రం అనంతగిరి అడవుల్లో ఆగ డం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికైనా అనంతగిరి అడవుల్లో సెలవు రోజుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని, పర్యాటకులకు, వన్యప్రాణులకు ఇబ్బంది కలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్శకులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ఆగస్టు 15న సెలవు రోజు కావడంతో అనంతగిరి కొండల ప్రాంతాలకు భారీగా వెళ్లిన యువకులు నిన్న సెలవు దినం కావడంతో వికారాబా ద్‌ కొండల అందాలను, ఆహ్లాదాన్ని తిలకించేందుకు చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లారు. అక్కడికి వచ్చిన సంద ర్శకులు కార్లు, బైక్‌ పందాలతో ఇబ్బంది తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు అటవీ ప్రాంతాన్ని విజిలెన్స్‌ అధికారులు పరిశీలించారు. మంగళ వారం కార్ల రేస్‌ జరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారు లు పరిశీలించి.. రేసింగ్‌ నిర్వహించిన వ్యక్తిని గుర్తించారు.
ఇబ్బందులు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
అనంతగిరి అడవుల్లో జరిగిన బైక్‌, కార్ల రేసింగ్‌ను అధి కారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో కార్‌ రేసింగ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అడవుల్లో రేసింగ్‌లతో కొందరు యువకులు దుమ్ము రేపి అలజడి సృష్టించారు. రేసింగ్‌ జరిగిన ప్రాంతాన్ని అట వీశాఖ, పోలీస్‌ అధికారులు పరిశీలించారు. అనంతగిరి అడవుల్లో ఎక్కడెక్కడా రేసింగ్‌ నిర్వహించే స్పాట్స్‌ ఉన్నాయో వాటిని పరిశీలించారు. అడవి మొత్తాన్ని ఫారెస్ట్‌ డిపార్ట్‌మెం ట్‌ అధికారులు చుట్టేశారు. రేసింగ్‌లో ఎంతమంది పాల్గొ న్నారు.. ఎవరు సహకరించారనే విషయాలపై ఆరా తీస్తు న్నారు. రేసింగ్‌ నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకు నేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ఫారెస్ట్‌ అధికా రులు, పోలీసులు బిజీగా ఉన్నారు. దీన్ని అదునుగా చేసు కుని సుమారు 70 బైకులు, 30 కారులతో యువకులు రే సింగ్‌ చేపట్టారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్క ర్లు కొట్టడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వా హనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఆధారంగా నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. అనంతగిరి హిల్స్‌లో జరిగిన కార్ల రేసింగ్‌పై జిల్లా ఎస్పీ కోటి రెడ్డి స్పందించారు. ఇప్పటికే కొన్ని వాహనాలను గుర్తించామని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేసింగ్‌లో ఎంతమంది పాల్గొ న్నారనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. రేసింగ్‌ నిర్వాహ కులను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.