నవతెలంగాణ-రాయపర్తి
రాయపర్తి అబ్బాయి థాయిలాండ్ అమ్మాయి వివాహం శనివారం వైభవంగా జరిగింది. రాయపర్తికి చెందిన ఎస్తేర్-జాన్సన్ కుమారుడు స్టీవ్ నెల్సన్. థాయిలాండ్ దేశానికి చెందిన మేరీ-హెలైన్ కూతురు డె బోరా 2018సంవత్సరంలో చైన్నై చదువుకుంటుండగా వీరి మధ్య స్నే హం ఏర్పడింది అది ప్రేమగా మారింది. కాగా ఇరువురి తల్లి దండ్రుల సమక్షంలో వరంగల్ జరుపాక చర్చిలో అంగరంగ వైభవంగా వివా హం జరిగింది. ఎర్రబెల్లిచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి ఉషా దయా కర్‌రావు వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, పోగులకొండ వేణు తదితరులు పాల్గొన్నారు.