హమ్ రహి ని లాంచ్ చేసిన లుపిన్

– డయాబెటీస్ మేనేజ్ మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన పేషంట్ సపోర్ట్ సిస్టమ్ 

నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఫార్మా మేజర్ అయినటువంటి లుపిన్ లిమిటెడ్ (లుపిన్) ఇప్పుడు హమ్ రహి అనే ఒక కొత్త పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభింస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా డయాబెటీస్ మేనేజ్ మెంట్ లో సరికొత్త కట్టుబడి, ప్రవర్తన, పరివర్తన ద్వారా కొత్త శకానికి నాంది పలికింది లుపిన్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారతదేశంలో ఉన్నారు. సుమారు 77 మిలియన్ల మంది ప్రజలు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. 2045 నాటికి దాదాపు ఈ సంఖ్య 134 మిలియన్లకు పెరుగుతుందని అంచానా వేస్తున్నారు వైద్య నిపుణులు. తద్వారా ఇలాంటి సమయంలో వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారం యొక్క ఆవశ్యకతను ఇది మరోసారి గుర్తు చేస్తుంది. అనారోగ్యంతో జీవించే వ్యక్తులు గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, నరాలు దెబ్బతినడం, దృష్టి లోపంతో సహా వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ, సమర్థవంతమైన నిర్వహణ ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలదు.
హమ్ రహి అంటే అర్థం నమ్మకమైన సహచరుడు అని. ఇది డయాబెటీస్ మేనేజ్ మెంట్ మీకొక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. పర్సనలైజ్ డ్ డైట్ కౌన్సిలింగ్, మందుల సహాయం మరియు అనుకూలమైన జీవనశైలి మార్పులను ఇది సూచిస్తుంది. తద్వారా, ఆరోగ్య సంరక్షణ నిపుణుల మార్గదర్శకత్వంలో చికిత్సకు కట్టుబడి ఉండటం యొక్క క్లిష్టమైన అంశాలను నొక్కి చెప్పడం ద్వారా ఇది సమగ్ర మద్దతును అందిస్తుంది. ఇంకాచెప్పాలంటే, ఖచ్చితమైన ఇన్సులిన్ ఇంజెక్షన్ పద్ధతులకు అవసరమైన అవగాహన మరియు నైపుణ్యాలతో హమ్ హరి పేషంట్లకు శక్తినిస్తుంది. దీంతో వారు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు మెరుగైన జీవన నాణ్యతను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. పేషంట్లు ఈ యాప్ ని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా లేదంటే ఇందుకోసమే పనిచేసే వెబ్‌సైట్ https://humrahi.co.in ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అదనంగా, వ్యక్తిగతంగా సహాయం కోరుకునే వ్యక్తులు టోల్-ఫ్రీ నంబర్ 7808777777 వద్ద కేర్ ఎగ్జిక్యూటివ్‌తో కనెక్ట్ కావచ్చు.
“మధుమేహం మన దేశంలో ప్రతీ ఒక్కరికీ వచ్చే వ్యాధిలా అంటే ఒక అంటు వ్యాధిలా మారిన స్థాయికి చేరుకుంది. మన దేశం ప్రపంచ మధుమేహ రాజధాని అనే బిరుదు కూడా సంపాదించింది. ఇప్పుడు హమ్ రహితో, వ్యాధి గురించి అవగాహన పెంచడం నుండి చికిత్సకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం వరకు రోగులకు సమగ్ర మద్దతును అందించడం మా ప్రత్యేకత. భారతదేశంలోని ప్రతి డయాబెటిక్ పేషెంట్‌కు హమ్ రహి యొక్క ప్రయోజనాలు, మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం వారి ప్రయాణంలో వారి అంకితభావ భాగస్వాములుగా పనిచేస్తాయి” అని అన్నారు లుపిన్ ప్రెసిడెంట్ ఇండియా రీజియన్ ఫార్ములేషన్స్ రాజీవ్ సిబల్.