– 3 శాతం పడిపోయిన షేర్ విలువ
కోల్‌కత్తా : లోదుస్తుల కంపెనీ లక్స్ ఇండిస్టీస్ రూ.200 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అరోపించింది. ఆ సంస్థ కోల్‌కత్తా కార్యాలయం సహా సంబంధిత ఇతర నగరాల్లోని స్థలాల్లోనూ ఐటి అధికారులు తనిఖీలు చేశారు. ఈ వార్తలు బయటికి రావడంతో ఆ కంపెనీ షేర్ 3.19 శాతం పతనమై రూ.1,470.9కి పడిపోయింది. విచారణలో అధికారులకు సహకరిస్తామని లక్స్ ఇండిస్టీస్ తెలిపింది.