మాదాసి కుర్వ సంఘం ఆత్మీయ సమ్మేళనం

నారాయణపేటటౌన్‌: జిల్లా కేంద్రంలో మాదాసి కురువ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి పేట ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నారాయణ పేట రూపు రఖలు మరాయని, నారాయణపేటలో పలు అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1000 నుంచి రూ. 2016 రూ. పింఛన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. నారాయణపేటలో రోడ్డు వెడల్పు ,సెంట్రల్‌ లైటింగ్‌, మెడికల్‌ కాలేజి, అక్కడే పెద్ద ఆసుపత్రి, నర్సింగ్‌ కాలేజి, ప్రతిది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిందని తెలిపారు. ఇప్పుడిప్పుడే మనం అభివద్ధి కార్యక్ర మాలలో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాదాసి కురువ సంఘం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.