– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగ మాదిగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి మాదిగ ఇండిస్టియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (మిక్కీ) రాణించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫిక్కి కార్యాలయంలో జరిగిన మిక్కీ విస్తృత స్థాయి ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మాదిగ యువతీ, యువకులకు గొప్ప వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దేందుకు మిక్కీ కృషి చేయాలని సూచించారు. మిక్కీ ఆధ్వర్యంలో ఆస్పత్రులు , చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మిక్కీ అధ్యక్షులు విప్లవ్ గాంధీ, ఫౌండర్ సభ్యులు మహేష్, మిక్కి రాష్ట్ర నాయకులు చైతన్య, ఉమాపతి, అభిలాష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.