19న మహాధర్నాను విజయవంతం చేయాలి

– టీపీయూఎస్‌ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, శ్రీను
నవతెలంగాణ-శంకర్‌పల్లి
19న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని టీపీ యూఎస్‌ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు జంగరు జంగయ్య, కవ్వగూడెం శ్రీను పిలుపునిచ్చారు. తపస్‌ శంకర్‌ పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని వివిధ పాఠశాలలో మహాధర్నా వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ నియమించి, 20 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటిం చాలన్నారు. ప్రతి పాఠశాలలో స్కావెంజర్‌ను నియమించి, బదిలీలు, ప్రమోషన్లు చేపట్టి, టెట్‌తో పాటు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ ఏరియాస్‌ను, డీఏ ఏరియాస్‌ను ఓకే విడతలో చెల్లించాలని కోరారు. పండిత్‌ పీఈటీ అప్‌గ్రేడేషన్‌ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమ స్యలు పరిష్కరించాలన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్‌ నిరంతరం ఉద్యమాలు చేపడుతోందన్నారు. తపస్‌ ఆధ్వర్యంలో 19న నిర్వహించే రాష్ట్రస్థాయి ధర్నాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలికల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలుర, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.