నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జూన్ 2న గన్‌పార్కు నుంచి గాంధీభవన్‌కు ర్యాలీ నిర్వహిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. అందుకోసం పార్టీ పక్షాన కమిటీని నియమిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరివల్ల వచ్చిందో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ ఎలా మోసపోయారనే విషయాన్ని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం కష్టపడిన ఎంపీలు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సన్మానం చేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్రంలోని ఉద్యమకారులకు ఉద్యోగాలు దక్కలేదన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలందరినీ మోసం చేశారని చెప్పా రు. కేసీఆర్‌కు ఓటేస్తే తెలంగాణ భూములు ఆక్రమించుకున్నారని విమర్శించారు. సోనియా స్థానంలో ఇంకెవరూ ఉన్న తెలంగాణ వచ్చేది కాదన్నారు.
కర్నాటక సీఎంను కలిసిన వీహెచ్
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన నివాసంలో కలిసి మాజీ ఎంపీ వి హనుమంతరావు సోమవారం కలిశారు. జూన్‌లో తెలంగాణలో జరగనున్న బీసీ గర్జన సభకు ముఖ్యఅతిథిగా రావాలని ఆయన్ను కోరారు. ఇదే విషయమై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేత కూడా ఆహ్వానం అందిస్తారని తెలిపారు.వీహెచ్ వెంట తమిళనాడు పీసీసీ అధ్యక్షులు కె.ఎస్.అళగరి తదితరులు ఉన్నారు. కర్నాటక సీఎంగా ఎంపికైనందుకు ఆయనకు వీహెచ్ అభినందనలు తెలిపారు.