రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దపీట 

 – కెసిఆర్ హయంలో మైనార్టీల బతుకుల్లో మార్పు

 – హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ
నవతెలంగాణ- నసురుల్లాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని సోమేశ్వర్ గ్రామ శివారులో బాన్సువాడ  నియోజకవర్గం ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. బాన్సువాడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా బాన్సువాడ నియోజకవర్గం 9 మండలాల నుంచి భారీ సంఖ్యలో మైనార్టీ యువతీ యువకులు భారీ సంఖ్యలో బాన్సువాడకు తరలివచ్చారు. సోమేశ్వర్ శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలు చాలా సంతోషంగా ఉన్నారన్నారని అన్నారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. రాష్ర్టాన్ని ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీల కోసం చేసిన అభివృద్ధి శూన్యమని వచ్చే ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమాకి మరిన్ని పథకాలు తీసుకురానున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ స్కూళ్లను స్థాపించి వేలాది మంది ముస్లిం బిడ్డలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. మైనార్టీలు నేడు గొప్ప చదువులు చదువుతూ ఉన్నతంగా స్థిరపడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల బతుకుల్లో ఎంతో మార్పువచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మరొక్కసారి గెలిపించుకుంటే మన బతుకుల మరింత మెరుగుపడుతాయని, కాంగ్రెస్‌ మాటలు విని ఆగం కావొద్దన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో ప్రజలు కారు గుర్తుకు ఓటేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పార్టీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సురేందర్ రెడ్డి, మైనార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.