పర్మినెంట్‌ చేయాలి

– మంత్రి హరీశ్‌ రావుకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమను పర్మినెంట్‌ చేయాలనీ, మినిమం పేస్కేల్‌ను 2020 నుంచి అమలు చేయాలనీ మెడికల్‌, హెల్త్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు అసోసియేషన్‌ నాయకులు శుక్రవారం మంత్రి హరీశ్‌ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. పొరుగు సేవల విధానాన్ని రద్దు చేయాలనీ, జీతాలను నేరుగా ఉద్యోగి అకౌంట్లోకి వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారనీ, సమస్యలను పరిష్కరించాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించినట్టు నాయకులు పేర్కొన్నారు.