కల్వకుర్తిని సుందరంగా మారుస్తా…

– రణభేరి.. ప్రగతి అస్త్రంగా మా జయభేరి.
– విస్తత ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జయపాల్‌ యాదవ్‌
– అభివద్ధి తన అస్త్రం అని వాఖ్య
– ప్రజల ఆశిస్తులతో మరోసారి గెలుస్తాను
– నియోజకవర్గంలో పెరుగుతున్న మద్దతు
– కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రగతి చూపాం.. పనులు చేశాం.. నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాం.. నిరుపేదల కోసం ఎన్నెన్నో పథకాలు తెచ్చాం.. మరెన్నో అభివద్ధి పనులు చేయాల్సి ఉంది.కల్వకుర్తిని సుందరంగా మారుస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అన్నారు. పట్టణంలోని తన సొంత నివాసంలో గిరి కొత్త పెళ్లి గ్రామానికి చెందిన కార్యకర్తలను గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గ గత దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా అభివద్ధి చెందిందంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అన్ని వర్గాలను దష్టిలో పెట్టుకొని ఆయన రూపొందించిన పథకాలు నిరుపేదలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చాయన్నారు. ఇక తాను వ్యక్తిగతంగా నియోజకవర్గానికి చేసిన అభివద్ధి గురించి ప్రజలకి తెలుసని వివరించారు. భారీ ఎత్తున రహదారుల నిర్మాణం, విజయవంతంగా ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిది,పురపాలికతో పాటు పలు పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. సాగునీటి కోసం ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ తాగునీరు అందిస్తున్నామన్నారు. ఎన్నికల తర్వాత వినూత్న కార్యక్రమాలతో రైతుల ముందుకు వస్తుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో నర్సరీలో ఏర్పాటు ద్వారా, హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంచి పోషించడం జరిగిందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ఇలాంటి పథకాలు నిరుపేదలకు వరంగా మారితే, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు రైతుల జీవితాలను మార్చేశాయి అన్నారు. ముఖ్యంగా రైతుబంధు పింఛన్లు పెంచడమే గాక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం 3000 భతి 400 కి గ్యాస్‌ సిలిండర్‌ వంటివి అందజేస్తామన్నారు. కేసీఆర్‌ మరోసారి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఉన్నవి మాత్రమే కాకుండా మరెన్నో పథకాలు ప్రజల ముందుకు తెస్తారన్నారు. తనకు మరోసారి అవకాశం కలిగిస్తే కల్వకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా రూపొందిస్తానని వెల్లడించారు.
సాదాసీదాగా నామినేషన్‌ : రంగు ఆర్భాటం లేకుండా ఎమ్మెల్యే జయపాల్‌ యాదవ్‌ 5 మందితో కలిసి ఉదయం 10 గంటలకు నేరుగా రెవెన్యూ డివిజన్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాన్ని సమర్పించారు.కల్వకుర్తి నియోజకవర్గం లో విజ్ఞులైన ఓటర్లు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారని తెలిపారు. డిసెంబర్‌ 3 తేదీన బ్యాలెట్‌ బాక్స్‌లో తన విజయం పదిలం కాబోతున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జైపాల్‌ యాదవ్‌ నామినేషన్‌
నవతెలంగాణ -కల్వకుర్తి టౌన్‌
బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ బుధవారం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం, జడ్పీటీసీలు ఉప్పల వెంకటేష్‌, విజితా రెడ్డి, దశరథ్‌ నాయక్‌ తదితరులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆయన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని వివిధ దేవాలయాలలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివద్ధి సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామరక్షగా ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చడం జరిగిందని చెప్పారు.