మ్యానిఫెస్టోకు సూచనలు, సలహాలు ఇవ్వండి

– దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక శాస్త్రీమైన మ్యానిఫెస్టోను రూపొందించబోతున్నదని టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. అందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మ్యానిఫెస్టో కమిటీ సమావేశమైంది. అనంతరం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మ్యానిఫెస్టో ఏ విధంగా ఉండాలనే అంశంపై చర్చించినట్టు తెలిపారు. వాగ్దానాలకే పరిమితం కాకుండా మ్యానిఫెస్టో ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. సోనియా ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. అది ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలందరి ఆకాంక్షలమేరకు ఉంటుందని చెప్పారు.