బీకేేఎంయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

– జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు
నవతెలంగాణ-హన్మకొండ
భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ జాతీయ 15వ మహాసభలు నవంబర్‌ 2 నుండి 5 వరకు బీహార్‌ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరుగనున్నాయని మహా సభల జయ ప్రధానికి కృషి చేయాలని బి కే ఎం యు జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకట్రాములు ప్రసంగిస్తూ దేశ నలుమూలల నుండి భూమికోసం భుక్తి కోసం సామాజిక న్యాయం కోసం జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన కాకలు తీరిన వ్యవసాయ కార్మికోద్యమ నేతలు మహాసభలలో పాల్గొంటారని మహాసభ నవంబర్‌ రెండవ తేదీన లక్షలాది మందితో జరిగే బహిరంగ సభతో ప్రారంభమవుతుందన్నారు . గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్రమైన సంక్షోభానికి నెట్టివేసి రైతాంగానికి ,వ్యవసాయ కార్మిక వర్గానికి తీరనిద్రోహంచేస్తున్నదన్నారు .ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల నోట్లోమట్టికొడుతున్నదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణతో పాటు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాన్ని సాధించేందుకు పోరాట కార్యక్రమాలనుమహాసభలోరూపొందించడం జరుగుతుందన్నారు. మహాసభల ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈకార్యక్రమంలో జాతీయ సమితి సభ్యులు మోతె లింగారెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెలఎల్లేష్‌, జిల్లాప్రధాన కార్యదర్శి కర్రెలక్ష్మణ్‌, అధ్యక్షులు మంచాల తిరుపతి నాయకులు మునిగాల భిక్షపతి, బి.రాజమణి, మహేందర్‌, బొట్టు బిక్షపతి , గోక రాజయ్య, కోహెడ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.