నేడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బైక్ ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేయండి

– టిపిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హందన్,
– నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు
నవతెలంగాణ కంఠేశ్వర్:
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ అలీ షబ్బీర్ ని నియమించడంతో నేడు అనగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బీన్ హాందన్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశ వేణు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ భవన్ నందు పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హంధాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హంధాన్ మాట్లాడుతూ.. ఏఐసిసి పిసిసి కలిసి నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహమ్మద్ అలీ షబ్బీర్ ని నియమించడం జరిగిందని ,ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం మొదటిసారి నిజామాబాద్ కు వస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగత బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా బోర్గమ్ బ్రిడ్జి వద్ద మధ్యాహ్నం 2: 30 నిమిషాలకు బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. బైక్ ర్యాలీ ప్రారంభమై పులంగ్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తా, బడా బజార్ మీదుగా నెహ్రూ పార్క్ చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిజామాబాద్ నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రేపు నిర్వహించే బైక్ ర్యాలీ మరియు బహిరంగ సభను విజయవంతం చేయాలని, అదే విధంగా నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ ని ఘన మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మహమ్మద్ అలీ షబ్బీర్ ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడం సంతోషంగా ఉందని, రేపు షబ్బీర్ అలీ మొదటిసారి నిజామాబాద్ కు వస్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా బైక్ ర్యాలీతో స్వాగతం పలకడం జరుగుతుందని, అదేవిధంగా నెహ్రూ పార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. బైక్ ర్యాలీ బోర్గం బ్రిడ్జి వద్ద ప్రారంభమై పూలంగ్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తా, బడా బజార్ మీదుగా నెహ్రూ పార్కు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, కావున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, మొహమ్మద్ నయీం అలీ,నజీబ్ అలీ, డాక్టర్. శివ ప్రసాద్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపూల్ గౌడ్,రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్, గడుగు రోహిత్, జిల్లా మైనారిటీ అద్యక్షులు ఇర్ఫాన్ అలీ, అబుద్ బిన్ హండం, అబ్దుల్ ఏజజ్, ఈసా, కేశ మహేష్, బొబ్బిలి రామకృష్ణ, విజయ్ పాల్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.