రోడ్డు వేయండి మహా ప్రభో..

– రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్న లవ్వాల గ్రామ ప్రజలు

నవతెలంగాణ – తాడ్వాయి 
స్వాతంత్రం సిద్ధించి సుమారు 77 సంవత్సరాల అవుతున్నప్పటికీ తమ బతుకులు మాత్రం నేటికీ బురదలోనే మగ్గుతున్నాయని “లవ్వాల” గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామపంచాయతీ పరిధిలో గల “లవ్వాలా” గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజనులకు నేటికీ రోడ్డు మార్గం సక్రమంగా లేదు.. దీంతో ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల, ముత్తాతలు, తండ్రుల నుండి ఇక్కడే నివసిస్తున్న మమ్మల్ని ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు అధికారులు రోడ్డును కొలతలు కొలుచుకున్నారని, వారి తర్వాత అటవీశాఖ అధికారులు కూడా కొలతలు కొలుచుకున్నారని ఇప్పుడు మర్చిపోయారని ఆవేదన చెందారు. ఎన్నికల సమయంలో మీకు రోడ్డు ఏప్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన నాయకులు ఎవరు కూడా ఇప్పటివరకు రోడ్డును వేయలేదని విమర్శించారు. గతంలో మంజూరు అయింది కానీ ఫారెస్ట్ అధికారుల ఆంక్షలతో ఆగిపోయిందని తెలిసింది. ఎన్నికల సమయంలో నీకు రూడ్ ఇప్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన నాయకులు నేడు జాడ లేకుండా పోయారని విమర్శిస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులకు బుద్ధి చెప్తామని ఆగ్రహిస్తున్నారు. రోడ్డు మంజూరు చేయండి మహాప్రభో.. ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు బురదలోనే మగ్గుతున్నాయని “లవ్వాల” గ్రామ ఆదివాసి గిరిజనులు ఇప్పటికీ రోడ్డు లేక బురదలో నడవాల్సిన పరిస్థితి దాపురించిందని అంటున్నారు. రాత్రివేళ లవ్వాల స్టేజి వద్ద దిగి 4 కిలోమీటర్లు నడుచుకుంటా పోవాలంటే ఆ బురద, రాళ్ల  నుండి ఇండ్లకు పోవాలంటే భయమేస్తుంది అని వారు వాపోయారు. ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్డు మంజూరు చేయాలని లవ్వాల ఆదివాసి గిరిజనులు వేడుకుంటున్నారు.
Lord make the road..