– పీఆర్సీ చైర్మెన్‌కు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్
– ఎంప్లాయీస్ ఫెడరేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రెండో పీఆర్సీ చైర్మెన్‌గా నియమించడం పట్ల ఎన్ శివశంకర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అద్యక్షులు జె వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి జె కృష్ణారెడ్డి నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1.30 లక్షల మందికి సంబంధించిన వేతనాలు, ఇతర అంశాలను పీఆర్సీ కమిటీకి తెలియజేసేందుకు తగిన సమయం కేటాయించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 25 ఏండ్లకుపైగా పనిచేస్తూ అతితక్కువ వేతనాలతో, తీవ్రమైన పనిభారంతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ భద్రత వస్తుందనీ, కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎన్నో ఆశలు, ఆకాం క్షలతో ఉద్యమంలో భాగస్వాములయ్యారని వివరించారు. రాష్ట్రంలో మండల కార్యాలయాల నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు కోట్ల మంది ప్రజలకు అనేక సేవలందిస్తు న్నారని తెలిపారు. తొలి పీఆర్సీ కమిటీకి వారి సమస్యలను వివరించడంతో కమిషన్ వాటిని పరిగణనలోకి తీసుకుందని గుర్తు చేశారు. రెండో పీఆర్సీ కమిటీ దృష్టికి సమస్యలను తెచ్చేందుకు తగిన సమయం కేటాయించాలని కోరారు.