నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాల సంఘాల జేఏసీ చైర్మెన్‌గా జి.చెన్నయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో బూర్గుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వర్కింగ్ చైర్మెన్లుగా బూర్గుల వెంకటేశ్వర్లుతో పాటు కరణం కిషన్, మట్టుపల్లి సుబ్బారాయుడు, గద్ద శ్రీనివాస్, తదితరులను ఎన్నుకున్నారు. తమను ఎన్నుకున్నందుకు మాల నాయకులకు వారు ధన్యవాదాలు తెలిపారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో పాటు దళితుల సంక్షేమం కోసం దళిత బంధు వంటి పథకాలు అమలుచేస్తున్నందుకు సమావేశం హర్షం వ్యక్తం చేసింది. మాలల ఆత్మగౌరవ భవన్ కోసం ఐదెకరాల స్థలంతో పాటు రూ.10 కోట్లను కేటాయించాలని డిమాండ్ చేసింది.