కార్పొరేట్ కు దీటుగా మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల..

– తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలి..
– ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్..
నవతెలంగాణ –  డిచ్ పల్లి
కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు అన్ని సమకూర్చి ఇలాంటి లోటుపాట్లు లేకుండా విద్యాబోధన చేస్తున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకి పంపించే విధంగా చూసే బాధ్యత ఉందని ఎంపీపీబాదవత్ రమేష్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మన ఊరు మనబడి పథకంలో భాగంగా ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఆదనపు తరగతి గదులు,వంటి గది,తదితర వాటిని సర్పంచ్ లూలం సత్యనారాయణ ఉపసర్పంచ్ రఘునందన్ రాము ఎంపీటీసీ డీకొండ సరిత సుధీర్ ఆర్ అండ్ బి, నోడల్ తదితర అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఆలోచనతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలకు మనబడి మన ఊరు మనబడి పథకం కింద ఇందల్ వాయి మండలంలోని 17 పాఠశాలలను మంజూరు చేశారని దానిలో భాగంగానే మల్లాపూర్ లో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడిలో బాగంగ మన ఊరు – మన బడిలో పనులు చేపట్టడానికి ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక కృషి తో మరమ్మతులు,ఇతర పనులకు గాను 14 లక్షలు, కిచేన్ షేడ్ నిర్మాణానికి 4 లక్షలు ఎన్ అర్ఈజిఎస్ పథకం కింద మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. మంజురైన నిధుల నుండి పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయడం జరిగిందని, పాఠశాల చుట్టూరా పచ్చని చేట్లతో ఆహ్లాద కరమైన వాతావరణం లో ప్రతి తరగతి గదిలో టేబుళ్లు, ఫ్యాన్లు, తదితరు వాటిని ఏర్పాటు చేయడం హర్షించ దగ్గ విషయమన్నారు. ఇంత మంచి వాతావరణం మన గ్రామంలోని పాఠశాల పొందడం అన్ని హంగులతో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని , ఎదైన అవసరం ఉన్న గ్రామ పంచాయతీ, గ్రామ అభివృద్ది కమిటీ నుండి సమకుర్చడం జరుగుతున్నన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై కొన్ని రోజులు గడప ముందే విద్యార్థులకు దుస్తులు రాగి జావా పుస్తకాలు అందజేయడం మండలంలోనే ప్రథమంగా అందజేసినట్లు దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హరితహారం లో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారిని సంధ్యా నాయక్, మన ఊరు మనబడి ఇంచార్జ్ వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలివేరి గంగ దాస్, సీనియర్ నాయకులు పాశంకుమార్, అరటి రఘు ,మండల ఉపాధ్యక్షుడు బిరిష్ శేట్టి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.